
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక బేబీ బాయ్ కి తండ్రి అయ్యి హ్యాపీ గా ఉంటే ఆనందాన్ని రేసు గుర్రం సక్సెస్ మరింత పెంచింది. గత కొంత కాలంగా ఈ బేబీ బాయ్ కి పేరును పరిశీలిస్తున్న అల్లు కుటుంబం ఫైనల్ గా ఒక పేరుకి చెక్ పెట్టారు. ఈ బేబీ బాయ్ పేరు ‘అయాన్’. అయాన్ అనే పేరుకి అర్థం దేవుడు ఇచ్చిన గిఫ్ట్.
ఇప్పటికే ఈ పేరు విన్న చాలా మంది అల్లు ర్జున్ ఇమేజ్ కి తగ్గట్టుగానే స్టైలిష్ గా ఉందని అంటున్నారు. ఈ పేరు విషయంలో అల్లు ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లో కేవలం రెండు రోజుల్లోనే 3.73 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

