‘సరైనోడు’ లాంటి సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న బన్నీ !

‘సరైనోడు’ లాంటి సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న బన్నీ !

Published on Jun 26, 2018 4:45 PM IST

2016 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం’సరైనోడు’. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తరువాత గత ఏడాది అయన నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై మంచి కలెక్షన్స్ ను సాధించినా ఆయన స్థాయికి తగ్గ విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయింది.

ఇక ఇటీవల’ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ ఈ సినిమాతో కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ ‘సరైనోడు’ లాంటి భారీ విజయాన్ని అభిమానులకి అందివ్వాలని కథల ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట బన్నీ.

‘నా పేరు సూర్య’ విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరుకు ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే గత కొన్ని రోజులుగా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు మాత్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరి బన్నీ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు