ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే, బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో బన్నీ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
లోకేశ్ కనగరాజ్ తనదైన మార్క్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అడవికి రాజు సింహం అనేలా కొన్ని యానిమేషన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇక బన్నీ లుక్స్ ఈ సినిమాలో రెట్రో లుక్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకు అదిరిపోయే సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు.
ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి బన్నీ తనదైన మార్క్ వేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


