బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అల్లు అర్జున్.?

boyapati_allu_arjun
పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. అలాగే స్టైలిష్ లుక్ తో క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయడంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మంచి పేరుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఉంటుందో ఓ సారి ఊహించుకోండి..! అసలు ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ గురించి ఊహించుకోమని ఎందుకు చెబుతున్నానా? అని ఆలోచిస్తున్నారా.?

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను – అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సంవత్సరం ‘లెజెండ్’ తో బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే, అల్లు అర్జున ‘రేసు గుర్రం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో అనే దాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version