కార్తికేయ కోసం వస్తున్న స్టైలిష్ స్టార్..!

Published on Feb 27, 2021 12:02 am IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కూడా ఒకడు. కేవలం హీరో రోల్స్ మాత్రమే కాకుండా విలన్ గా సూపర్బ్ అనిపించాడు. అయితే ఇపుడు ఈ యువ హీరో లావణ్య త్రిపాఠితో కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “చావు కబురు చల్లగా”. కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ వేడుకకు సమయం దగ్గర పడింది.

అయితే ఈ మార్చ్ 19 న విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గాను మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ జెఆర్సి లో వచ్చే 9వ తారీఖున డేట్ కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ వేడుకకు గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రావడం కన్ఫర్మ్ అయ్యింది. ఇది వరకే ఎంతో మంది యంగ్ టాలెంట్ కు బన్నీ చాలా ప్రోత్సాహకం ఇచ్చాడు. అలాగే ఈ సారి కూడా కేవలం కార్తికేయ కోసమే స్పెషల్ గా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వస్తున్నాడట. మరి ఈ ఫంక్షన్ లో బన్నీ గ్రేస్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం తాను “పుష్ప” షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :