పూజా హెగ్డే మాటలతో ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Published on Sep 9, 2019 7:40 pm IST

‘అరవింద సమేత, మహర్షి’ లాంటి రెండు బ్యాక్ యు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించిన పూజా హెగ్డే ప్రస్తుతం ‘వాల్మీకి’ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుడలకు రెడీ అవుతోంది. ఇది కాకుండా అల్లు అర్జున్, త్రివిక్రమ్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’, ప్రభాస్, రాధాకృష్ణల కలయికలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈ రెండూ కూడా భారీ సినిమాలే.

వీటిలో నటిస్తున్నందుకు పూజా చాలా ఎగ్జైట్ అవుతోంది. అంతేకాదు రెండు సినిమాలపై చాలా నమ్మకంగా కూడా ఉంది. ముందుగా బన్నీ సినిమా గురించి చెబుతూ బకెట్ పాప్ కార్న్ రెడీ చేసుకోండి. సినిమా నిజంగా చాలా వినోదాత్మకంగా ఉంటుంది అంటూ ధీమాగా చెబుతోంది.

అలాగే ప్రభాస్ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ఈమధ్య కాలంలో అంతమంచి కథ వినలేదని, సినిమా యూరప్ నేపథ్యంలో ఉంటుందని, చాలా భారీగా చిత్రం ఉండబోతుందని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు వింటుంటే మాత్రం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయనే నమ్మకం కలుగుతోంది. బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ సైతం పూజా మాటలతో హ్యాపీగా ఫీలవుతునారు.

సంబంధిత సమాచారం :

X
More