అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్.. ఏంటో లుక్కేయండి..!

Published on Aug 25, 2021 12:30 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి పాటను ఆగస్టు 13న రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ పాట అల్లు అర్జున్‌కు ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. తెలుగులో ‘దాక్కో దాక్కో మేక’, కన్నడలో ‘జొక్కే జొక్కే మేకే’, తమిళంలో ‘ఒడు ఒడు ఆడు’, మలయాళంలో ‘ఒడు ఒడు ఆడే’, హిందీలో ‘జాగో జాగో బక్రే’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.

అయితే యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో తెలుగు పాట ‘దాక్కో దాక్కో మేకా మొదటి స్థానంలో నిలవగా కన్నడ పాట 9వ స్థానంలో, తమిళ వెర్షన్‌ 11వ స్థానంలో, మలయాళం వెర్షన్‌ 17వ స్థానంలో నిలిచాయి. అయితే యూట్యూబ్‌లో 11 రోజుల నుంచి ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇది ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :