తప్పుడు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

తప్పుడు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్

Published on Aug 19, 2014 11:35 AM IST

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద తీసిన ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్ కి అందరి నుంచి ప్రశంశలు దక్కాయి. ఇది విడుదలైన రెండు రోజులకి అల్లు అర్జున్ వివాదంలో ఇరుక్కొన్నాడు. అదే ద్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్ వలన ఈ విషయం మరింత పెద్దది అయ్యింది.

ఈ విషయంపై అల్లు అర్జున్ తన సోషల్ మీడియా పేజ్లో స్పందించాడు. ‘పోలీసులు నా కారును ఆపినట్లు వస్తున్న వీడియో పై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పోలీసులు నన్ను తాగానా లేదా అని చెక్ చెయ్యడం కోసం బ్రీతలైజర్ ని ఊదమన్నారు. కానీ అక్కడ చాలా మంది మీడియా వారు ఉండడంతో నేను కాస్త ఇబ్బందికి గురయ్యాను. ఆ తర్వాత వాళ్ళే నన్ను పక్కకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి అంతా బాగుందని పంపించేసారు. నాకు తెలిసి హైదరబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరన్నా పట్టుబడితే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వదలరు. ఈ విషయం లేకుండా ఓ వీడియో నెట్ లో తిరుగుతోంది. ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ చెయ్యడం మానేయండి. ఒక వేల నును డ్రింక్ చేసినా ఎప్పుడూ వాక్ చేసుకుంటూ వెళతా లేకపోతే ఎవరినన్నా డ్రాప్ చేయమని అడిగి వెళ్తాను. ఇలాంటి వీడియో ని రిలీజ్ చేసి నెగటివ్ గా ప్రచారం చేయడం అనేది అస్సలు బాగోలేదని’ అల్లు అర్జున్ అన్నాడు.

తాజా వార్తలు