ముఖ్య అంశాలు
- రామ్ చరణ్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమా చూసి ఫిదా అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
- కుస్తీ యోధుడిగా చరణ్ యాక్టింగ్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అద్భుతమంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు.
- బన్నీ తరహాలోనే టాలీవుడ్ హీరోలు సపోర్ట్ చేస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందంటున్న విశ్లేషకులు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ ఇప్పుడు ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మన స్టార్స్ ఎవరూ స్పందించడం లేదు అనే కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆకాశానికెత్తేశారు. కజిన్స్ అయిన వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి ఈ ట్వీట్‌తో బయటపడటంతో మెగా, అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నిన్న రాత్రి తాను ‘పెద్ది’ సినిమా చూశానని అల్లు అర్జున్ తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. “నా సోదరుడు రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో స్క్రీన్‌పై ప్రాణం పోశాడు. రగ్డ్ అండ్ రా పర్ఫార్మెన్స్‌తో పాటు అతడి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. ప్రతి విషయంలోనూ చరణ్ ఇరగదీశాడు. చరణ్‌ను చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. తను పడుతున్న కష్టానికి, డెడికేషన్‌కు ప్రతి ప్రశంస దక్కాల్సిందే” అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు.
కేవలం చరణ్ గురించే కాకుండా.. సినిమాలో నటించిన ఇతర యాక్టర్స్‌ను కూడా అల్లు అర్జున్ ప్రశంసించడం జరిగింది. జగ్గుభాయ్ (జగపతిబాబు) గారి నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని, లీడింగ్ లేడీ జాన్వీ కపూర్‌తో పాటు మిగిలిన ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా కెప్టెన్, డైరెక్టర్ బుచ్చిబాబు సానాపై బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరినీ స్క్రీన్‌పై ఎలివేట్ చేసిన విధానం, చరణ్ క్యారెక్టర్‌ను హై పెడెస్టల్‌పై నిలబెట్టిన తీరు అద్భుతం అంటూ కితాబిచ్చారు. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఇలా పెద్ది టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు.
స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. క్రాసోవర్ అథ్లెట్ గా రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అస్సెట్‌గా మారాయి. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో ఇలా సపోర్ట్ చేయడం ఇండస్ట్రీలో హెల్తీ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ తరహాలోనే టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలు కూడా ముందుకు వచ్చి ‘పెద్ది’ లాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే.. మూవీ పాజిటివ్ టాక్ మరింతగా జనాల్లోకి వెళ్లి, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026


