సోషల్ మీడియాలో బన్నీ హవా మాములుగా లేదు..!

Published on Apr 6, 2020 3:02 pm IST

అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ఆయన్నీ ఓ అభిమాన సైన్యం ఫాలో అవుతుంది. టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో కూడా బన్నీకి అభిమాన సంఘాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రతి సినిమా అక్కడ కూడా విడుదల అవుతుంది. ఆయన తాజా బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా మలయాళంలో విడుదలైంది. ఈ మూవీలోని సాంగ్స్ ఒక ఊపు ఊపగా బాలీవుడ్ సెలెబ్రిటీలతో సైతం స్టెప్స్ వేయించాయి. శిల్పా శెట్టి అల వైకుంఠపురంలోని బుట్ట బొమ్మా సాంగ్ కి డాన్స్ వేయడం జరిగింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బన్నీ ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతుంది. గతంలో బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ ససంఖ్య 3.8 మిలియన్స్ లోపే ఉండగా అది 4.1 మిలియన్స్ కి చేరింది. అలాగే ఇంస్టాగ్రామ్ లో సైతం బన్నీ ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియన్స్ కి చేరడం విశేషం. ఇప్పటికే అల్లు అర్జున్ పేస్ బుక్ పేజ్ ని 12 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఈ విధంగా ఓవర్ ఆల్ గా చూసుకుంటే బన్నీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More