“పుష్ప”లో యాక్షన్ కోసం బన్నీ గట్టి కసరత్తులు.!

Published on Jun 16, 2021 6:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్టర్ గా “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఆల్రెడీ 80 శాతం షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మిగిలిన భాగం కూడా పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ పై కూడా గత కొన్నాళ్ల నుంచి ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి.

మరి వాటితో పాటే బన్నీ ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నాడో తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీ ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ కు గాను ఎలాంటి డూప్ లేకుండానే చేస్తున్నాడట.. అలాగే ఆ సీన్స్ కి గాను ఎంతటి రిస్క్ కి అయినా కూడా బన్నీ రెడీ నే అంటున్నాడట. మరి ఇప్పటికే ఈ చిత్రాన్ని కొన్ని నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని తెలిసింది. మరి వాటికి బన్నీ డెడికేషన్ కూడా తోడయ్యి మరింత హైలైట్ కావడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :