ఆపిల్ శిరీతో అల్లు అయాన్ ఫన్నీ ముచ్చట్లు !

ఆపిల్ శిరీతో అల్లు అయాన్ ఫన్నీ ముచ్చట్లు !

Published on Jun 7, 2020 3:40 PM IST

హీరో అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటాడు. తాజా వీడియోలో, బన్నీ ఆపిల్ వాచ్‌ లో అల్లు శిరీష్ అనుకుని అయాన్ చేసిన అందమైన సంభాషణ బన్నీ అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది.

వీడియోలో, అల్లు అయాన్ అల్లు శిరీష్ ను ఉద్దేశించి “మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ?’ అని అడగడం, మళ్ళీ డౌట్ వచ్చి మీరు మా బాబాయేనా అని అయాన్ అడగడం బాగుంది. ఈ వీడియోని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “ఆపిల్ శిరీ మరియు అల్లు శిరీ దగ్గర దీనికి సమాధానం లేదు అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు అల్లు శిరీష్. ఈ చిత్రం పర్వాలేదనే విజయాన్ని అందుకుంది. అయితే లాక్ డౌన్ తరువాత కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు శిరీష్. అన్ని పనులు పూర్తై సినిమా ఈ పాటికే మొదలవ్వాల్సింది. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదాపడింది. ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అట. ఎంటర్ టైనర్ తోనైనా అల్లు శిరీష్ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

https://www.instagram.com/p/CBIGHkll-tr/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు