ఈ స్పెషల్ డే న బన్నీ స్పెషల్ రిక్వెస్ట్.!

Published on Jun 5, 2021 1:03 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో రష్మికా మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి ప్రస్తుతం అంతా స్వల్ప విరామంలో ఉన్నారు. అయితే ఇదే గ్యాప్ లో బన్నీ తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతూ వస్తున్నాడు.

అలాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన పెరట్లో ఒక మొక్కను నాటి ప్రతి ఒకరికి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని మొక్కలు నాటి ఈ భూమిని వచ్చే తరాలకి మరింత పచ్చదనం అందించాలని తెలిపాడు. అలాగే బన్నీ మరో రిక్వెస్ట్ కూడా చేసాడు.

ప్రతి ఒకరు ఒక మొక్కను నాటి తమ ఫోటోస్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టాలని వాటిలో కొన్ని తాను కూడా షేర్ చేస్తానని తెలిపాడు. ఇలా ప్రతి ఒకరం కలిసి మన భూమిని కాపాడుకుందాం అని బన్నీ విన్నవించాడు. మరి మరోపక్క ప్రస్తుతం తాను చేస్తున్న “పుష్ప” టీజర్ సాలిడ్ రికార్డ్స్ సెట్ చేస్తుంది.

సంబంధిత సమాచారం :