బోయపాటి కోసం స్పెషల్ ట్రైనింగ్ లో అల్లు అర్జున్

boyapati_allu_arjun
సమ్మర్ కానుకగా ‘S/O సత్యమూర్తి’ అంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 19 నుంచి మొదలు కానుంది. ప్రతి సినిమాలోనూ హీరోకి ఓ డిఫరెంట్ గెటప్ అండ్ స్టైల్ ని డిజైన్ చేసే బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం కూడా ఓ న్యూ స్టైలిష్ లుక్ ని డిజైన్ చేసాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తన పాత్రని డిజైన్ చేసిన స్టైల్ లోకి మారే పనిలో ఉన్నాడు.

అల్లు అర్జున్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ తో పాటు, ఫిజికల్ గా కూడా కాస్త స్ట్రాంగ్ గా కనిపించాల్సి ఉంది. అందుకే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన బాడీ లుక్ ని మార్చే పనిలో ఉన్నాడు. అల్లు అర్జున్ ని అందరూ షాక్ అయ్యే రీతిలో బోయపాటి శ్రీను ప్రెజంట్ చేయనున్నాడని ఈ చిత్ర టీం అంటోంది. జూలై 19న మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని థాయ్ లాండ్ ఫెయిర్ మాస్టర్ కేచ కంపోజ్ చేయనున్నాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రేస హీరోయిన్స్ గా కనిపించనున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version