ఎన్టీఆర్, మహేష్ లను అధిగమించిన బన్నీ.

Published on Apr 10, 2020 10:59 am IST

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. బన్నీ ఊర మాస్ డీ గ్లామర్ లుక్ లో ఇరగదీశాడు. రాయలసీమకు చెందిన మొరటు డ్రైవర్ రోల్ చేస్తున్న అల్లు అర్జున్ ఆ పాత్రకు బాగా సెట్ అయ్యారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని శేషాచలం అడవులలో సాగే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కాగా పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు మూవీ ఫస్ట్ లుక్ గా రికార్డు కొట్టిన బన్నీ ఈ విషయంలో ఎన్టీఆర్, మహేష్ లను కూడా దాటేశాడు. గతంలో 70.2 వేల లైక్స్ తో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ లుక్ మొదటి స్థానంలో ఉండగా, బన్నీ 80.1 వేల లైక్స్ తో ఆ రికార్డుని అధిగమించాడు. దీనితో 67.2 వేల లైక్స్ తో మహేష్ మహర్షి లుక్ సెకండ్ స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది. పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More