కొత్త అఫీస్ ప్రారంభించిన అల్లు అర్జున్ !

Published on Sep 25, 2018 11:36 am IST

అల్లు అర్జున్, రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తదుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ, త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రకథకు సంబంధించి బన్నీ కొన్ని మార్పులు కూడా చెప్పారని, ఈ సారి స్క్రిప్ట్ చాలా పకడ్బంధీగా ఉండేలా చూసుకుంటున్నారని.. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, శాసనం నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని కూడా గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా బన్నీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. అల్లు అర్జున్ తన ఆఫీస్‌ మార్చారు. ఇన్ని సంవత్సరాలు గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ లోనే బన్నీ తన సినిమాకి సంబంధించిన పనులన్నీ చేసేవాడు. కాగా తాజాగా బన్నీ జూబ్లీ హిల్స్‌లో ప్రత్యేకంగా తన కోసం ఓ కొత్త ఆఫీస్‌ ను ప్రారంభించారు. ఇక నుంచి బన్నీ సినిమాలకు సంబంధించి ప్రతిపని ఈ ఆఫీస్‌ లో జరుగుతుందట. మరి ఈ అఫీస్ లోకి వెళ్ళాక బన్నీ భారీ హిట్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :