స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెట్స్ పై ఉంది. అల్లు అర్జున్ ప్రతి డిపార్ట్ మెంట్ లో కొత్తగా ఏదో చూస్పించాలి, స్టైలిష్ గా ఉండాలి అనుకునే హీరోస్ లో మొదట ఉంటాడు. ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ తన కాస్ట్యూమ్స్ విషయంలో, మానరిజమ్స్ మరియు ఫైట్స్ బాగా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే విధంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న త్రివిక్రమ్ సినిమాలో కూడా ట్రై చేస్తున్నాడు.
ప్రసతుతం ఈ సినిమాకి సంబందించిన ఓ ఫైట్ ని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్లో చిత్రీకరిస్తున్నారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్ ని చాలా స్టైలిష్ గా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్టార్ ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ తో ‘జులాయి’ సినిమా నిర్మించిన రాధాకృష్ణ ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు.


