స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలు అతడికి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య-2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ హట్రిక్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.యెన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ‘రుద్రమదేవి’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కే సినిమాలో నటిస్తాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్, బన్నీల సినిమా పట్టాలేక్కుతుంది.


