మాస్ & క్లాస్ ఫొటో ను షేర్ చేస్తూ అభిమానులకు థాంక్స్ తెలిపిన ఐకాన్ స్టార్!

Published on Aug 30, 2021 6:57 pm IST

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా, సౌత్ లో ఇప్పటి వరకూ 13 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు 13 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం పట్ల అభిమానులు అల్లు అర్జున్ తనదైన శైలి లో థాంక్స్ తెలిపారు.

రాక్స్ పై బ్లాక్ డ్రెస్ లో మాస్ అండ్ క్లాస్ లో ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశారు అల్లు అర్జున్. థాంక్ యూ ఫర్ ఆల్ లవ్ అండ్ బ్లెస్సింగ్ అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ తగ్గేదే లే, లవ్ అండ్ లైక్ సింబల్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నటుడు ఫాహద్ ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు, వీడియోలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :