‘చావు క‌బురు చ‌ల్ల‌గా’కి ముఖ్య అతిథిగా స్టార్ హీరో ?

Published on Mar 1, 2021 3:59 pm IST

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ మార్చి 9న జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో అల్లు అర్జున్ హాజరుకానున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 19న తెరపైకి రానుంది. కాగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా రానుంది.

కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ”పైన పటారం” ఐటమ్ సాంగ్ లో మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను హీరో కార్తికేయ – యాంకర్ అనసూయ బాగా అలరించారు. ఇప్పటికే విడుదలైన హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మై నేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :