జనసేన అధినేత ను పరామర్శించనున్న స్టైలిష్ స్టార్ !

Published on Apr 8, 2019 11:09 am IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇటీవల వడదెబ్బకు గురియైన విషయం తెలిసిందే. చికిత్స తీసుకున్న అనంతరం మళ్ళీ ప్రచారంలో బిజీ అయ్యారు పవన్. ఇక మొన్న హీరో రామ్ చరణ్ ఆయన్ను పరామర్శించగా తాజాగా అల్లు అర్జున్ రేపు రాజమండ్రి చేరుకొని అక్కడ నుండి పాలకొల్లు వెళ్లి పవన్ ను పరామర్శించి ఆయనకు మద్దతు తెలుపనున్నారని సమాచారం.

ఇక ఆ తరువాత జనసేన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగ బాబు ను కలిసి తన మద్దతు తెలుపనున్నాడు అల్లు అర్జున్. ఇక ఇప్పటికే నాగబాబు తరపున వరుణ్ తేజ్ , నిహారిక ప్రచారంలో పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం :