బన్నీ చేతుల “మోసగాళ్ల” స్కామ్ సీక్రెట్.!

Published on Sep 30, 2020 10:09 am IST

ఇపుడు మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ ప్రాజెక్టుల హవా మొదలయ్యింది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియన్ సినిమాలుగా తమ ప్రాజెక్టులను మలుస్తున్నారు. అలా మంచు వారి ఫ్యామిలీ హీరో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “మోసగాళ్లు”ను కూడా పాన్ ఇండియన్ ఫ్లిక్ గా రెడీ చేయనున్నారు. స్వయంగా మంచు విష్ణునే నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు.

అయితే ఇటీవలే విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి హైప్ రాగా ఇపుడు మరింత హైప్ ఇచ్చేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మోసగాళ్ళతో చేతులు కలిపాడు. ఈ చిత్రం తాలుకా టీజర్ ను బన్నీ చేతుల మీదుగా ఈ అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది. ప్రపంచంలోని ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా ఈ చిత్రాన్ని జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ స్కామ్ ఏమిటి అన్నది బన్నీ చేతుల మీదగా అక్టోబర్ 3న రిలీజ్ కాబోయే టీజర్ గ్లింప్స్ తో రివీల్ అవ్వడంతో తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More