విజయ్ దేవరకొండ త్వరలోనే అగ్ర హీరో అవుతాడు – అల్లు అరవింద్ !

విజయ్ దేవరకొండ త్వరలోనే అగ్ర హీరో అవుతాడు – అల్లు అరవింద్ !

Published on Aug 12, 2018 10:07 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు వైజాగ్ లో జరుగుతుంది. ఈసంధర్బంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ స్పాన్ ఉన్న నటుడు త్వరలోనే తెలుగులో అగ్ర హీరోల జాబితాలో చేరనున్నాడని అలాగే ఈ చిత్ర డైరెక్టర్ పరుశురాం నా సంస్థలో 3సినిమాలను డైరెక్ట్ చేసాడంటే అర్ధం చేసుకోవచ్చు అతని మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో అని అన్నారు.

గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు