శరవేగంగా అల్లు అర్జున్ సినిమా

Published on Jun 23, 2019 12:45 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల చర్చల తర్వాత బన్నీ ఈ సినిమాకు ఫిక్స్ అయ్యారు. దీంతో సినిమా అనుకున్న దానికంటే ఆలస్యంగా మొదలైనా శరవేగంగా జరుగుతోంది. ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే ఇంకోవైపు సంగీత దర్శకుడు తమన్ తన పని మొదలుపెట్టారు.

సినిమాకు హోరెత్తించే మాస్ బీట్స్, వినసొంపైన మెలోడీస్ రెడీ చేస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరూ దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తున్నారు. త్రివిక్రమ్, బన్నీ సినిమాలు ఏవి చూసినా వాటిలో ఏ అంశం ఎలా ఉన్నా పాటలు మాత్రం కొన్నాళ్లతోపాటు గుర్తిండిపోయేలా ఉంటాయి. ఈసారి కూడా అలంటి ఆల్బమ్ కోసం వారు ట్రై చేస్తున్నారు. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More