“పుష్ప” విషయంలో తగ్గేది లేదు అంటున్న బన్నీ.?

“పుష్ప” విషయంలో తగ్గేది లేదు అంటున్న బన్నీ.?

Published on Dec 10, 2020 7:03 AM IST

Pushpa

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యనే షూట్ ను స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా కరోనా సెగ తగిలి మళ్ళీ ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు బన్నీ వారి కుటుంబంలో నిహారికా వివాహ వేడుకలో బిజీగా ఉన్నాడు. ఇక దీని తర్వాత మాత్రం పుష్ప మేకర్స్ కు ఊహించని టాస్కునే ముందు ఉంచాడట. ఇంతకు ముందులా ఎక్కువ కాలం గ్యాప్స్ వద్దని సాధ్యమైనంత త్వరగా షూట్ ను మళ్ళీ ప్రారంభించాలి అని సూచించాడట.

దీనితో పుష్ప మేకర్స్ ఆ పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా బ్రేక్ తీసుకున్నందున ఎలాగైనా సరే బన్నీ ఈ చిత్రాన్ని త్వరగా ఫినిష్ చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు