పిక్ టాక్ : టోక్యోలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

పిక్ టాక్ : టోక్యోలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

Published on Jan 17, 2026 5:03 PM IST

Allu Arjun 1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టోక్యోలో ‘పుష్ప 2 : ది రూల్’ జపనీస్ డబ్బింగ్ వెర్షన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్‌కు జపాన్‌లో మంచి స్పందన రావడంతో అక్కడ స్వయంగా ప్రచారం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ప్రమోషన్ల మధ్యలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రసిద్ధ సెన్సోజి ఆలయాన్ని సందర్శించారు. సతీమణి స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హాతో కలిసి గడిపిన ఈ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జపాన్ టూర్ అనంతరం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ యాక్షన్ సినిమాతో పాటు, లోకేష్ కనగరాజ్‌తో ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్‌పై పని చేయనున్నారు.

తాజా వార్తలు