అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం

Published on Jun 21, 2019 9:05 pm IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం చేసుకున్నారు. నీల షా అనే అమ్మాయిని బాబీ వివాహమాడారు. ఈ వివాహ కార్యక్రమం కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగింది. ఈ వివాహ వేడుక హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన నీల స్వస్థలం ముంబై.

సోదరితో కలిసి ఆమె యోగా డెస్టినేషన్ పేరుతో హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. నీల తండ్రి కమల్ కాంత్ ఒక వ్యాపారవేత్త. వీరి వివాహం పట్ల ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయట. అల్లు బాబీ గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో నిర్మితమయ్యే సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంటారు.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More