అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్

అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఫిక్స్

Published on Jun 29, 2015 4:09 PM IST

boyapati_allu_arjun
సమ్మర్ సీజన్ లో కోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టైలిష్ స్టార్ అర్జున్ తన తదుపరి సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి చేయనున్నాడు. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర టీం తెలిపిన్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం జూలై 17 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం బోయ పాటి శ్రీను ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

అలాగే అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేసారు. అలాగే మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. సెకండ్ హీరోయిన్ కోసం ఓ ఫ్రెష్ ఫేస్ ని చూస్తున్నారు. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూపని రీతిలో చూపేలా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు. అందుకోసమే అల్లు అర్జున్ కాస్త వెయిట్ తగ్గి తన లుక్ ని మార్చుకుంటున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుసగా ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి బన్ని సరసన నటించే అవకాశం రావడం మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

తాజా వార్తలు