యాత్ర డైరెక్టర్ తో బన్నీ కొత్త సినిమా ?

Published on Jul 14, 2020 12:10 am IST

దర్శకుడు మహి వి రాఘవ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘యాత్ర’ సక్సెస్ కావడంతో.. మహి వి రాఘవ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే ఆయన కొత్త సినిమా పై ఓ లేటెస్ట్ అప్ డేట్ ఏమింటంటే.. బన్నీతో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. మహి చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని, అయితే దర్శకుడి నుండి బన్నీ పూర్తి స్క్రిప్ట్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా మహి వి రాఘవ్ పీవీపీ బ్యానర్ లో ‘సిండికేట్’ అనే సినిమాను తియ్యబోతున్నాడని పీవీపీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఆ మధ్య అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు పీవీపీ బ్యానర్ కు ఎటువంటి సంబంధం లేదని.. ఇదొక పక్కా యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించేదాకా ఈ వార్తను నమ్మలేం. అయితే ఈ వార్త ఊహాగానాం అయినప్పటికీ, నెటిజన్లను బాగా ఆకర్షించింది.

సంబంధిత సమాచారం :

More