‘పుష్ప’ కోసం బన్నీ వారణాసికి..!

Published on Nov 30, 2020 6:54 am IST

‘అల వైకుంఠపురములో’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేస్తోన్న చిత్రం ‘పుష్ప’. సెన్సేషనల్‌ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. కాగా ఇటివలే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే డిసెంబర్ 18 నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ లో సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ మొత్తం వారణాసిలో జరుగుతుందట. అందుకే సుకుమార్ ఈ సాంగ్ మొత్తాన్ని వారణాసిలోనే తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.

ఇక గత నెలలోనే మొదలుకావాల్సిన ఈ సినిమా షూట్, లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కూడ నటీనటుల డేట్స్ వగైరాలు కుదరక ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చి.. రీసెంట్ గా రాజమండ్రిలో షూట్ మొదలైంది. మారేడుమిల్లి అడవుల్లో షూట్ ప్రస్తుతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :

More