‘పుష్ప’లో ఆ కోణం కూడ గట్టిగా ఉంటుందట

Published on Jun 29, 2021 10:07 pm IST

సుకుమార్ ప్రతి సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రీకరణ ఎలా ఉన్నా అందులో ఎమోషన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆయన ప్రతి కథలోనూ ఆనాటి ఎమోషన్ ఒకటి కథానాయకుడి పాత్రను డ్రైవ్ చేస్తుంటుంది. ఆయన ఆఖరి చిత్రం ‘రంగస్థలం’ చూస్తే ఈ సంగతి సులభంగా అర్థమవుతుంది. ప్రధాన పాత్ర చిట్టిబాబుకు తన అన్నయ్య అంటే ఎంతో ప్రాణం. కథ మొత్తాన్ని నడిపించేది ఆ ఎమోషనే. అలాంటి బలమైన ఎమోషన్ ‘పుష్ప’లో కూడ ఉంటుందట.

ఎన్నడూ లేనంత డీగ్లామర్ లుక్లో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. డీగ్లామర్ లుక్ మాత్రమే కాదు పక్కా మాస్ లుక్. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ చూస్తే బన్నీ చేస్తున్నది కరుడుగట్టిన స్మగ్లర్ పాత్రలానే అనిపిస్తుంది. కానీ అందులోనే సున్నితమైన భావోద్వేగాలు ఎన్నో ఉంటాయట. హీరో చుట్టూ ఉండే పాత్రలు, వాటితో జరిగే భావోద్వేగపూరిత సన్నివేశాలు ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రంలో బన్నీలోని పరిపూర్ణమైన నటుడు బయటపడతాడట. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎండు భాగాలుగా చేసి విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :