రుద్రమదేవిలో హైలైట్ కానున్న అల్లు అర్జున్ రోల్

రుద్రమదేవిలో హైలైట్ కానున్న అల్లు అర్జున్ రోల్

Published on Feb 25, 2015 3:34 AM IST

Allu-Arjun-As-Gona-Ganna-Re
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాకతీయుల కాలం నాటి బందిపోటు అయిన గోన గన్నారెడ్డిపాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ పై విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ మరియు మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ అల్లు అర్జున్ పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి పని చేస్తున్న సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చేసిన గోనగన్నా రెడ్డి పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని, అప్పటి వరకూ ఉన్న సినిమాని మరో స్థాయిలో పెడుతుందని అంటున్నారు.

అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమాను శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క జోడిగా చాళుక్య వీరబద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. కృష్ణం రాజు, సుమన్, ప్రకాశ్‌ రాజ్, నిత్యా మీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తోట తరణి కళా దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ త్రిడి సినిమాగా ‘రుద్రమదేవి’ చరిత్రకెక్కింది. ఫిబ్రవరి 28న ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు