బన్నీ లారీ డ్రైవరా..ఎర్ర చందనం దొంగా?

Published on Apr 9, 2020 3:00 am IST

బర్త్ డే బాయ్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజు వేడుకలు అతి సాధారణంగా సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. సుకుమార్ తో ఆయన చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కరోనా కర్ఫ్యూ కారణంగా సుకుమార్, బన్నీ ల మూవీ షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ బర్త్ డే కి చెప్పుకోదగ్గ అప్డేట్ ఉండదని భావించిన ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేశారు. పుష్ప అనే టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించగా, బన్నీ లుక్ సరికొత్తగా గతంలో ఎప్పుడూ ట్రై చేయనిదిగా ఉంది.

పోషణలేని కేశాలు, మాసిన బట్టలు, తోలు చెప్పులు ధరించి ఊరమాస్ గెటప్ లో ఉన్న బన్నీ లుక్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కిస్తుండగా, బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఐతే నేటి సెకండ్ లుక్ లో ఎర్ర చందనంతో పోలీసులకు పట్టుబడినట్టున్న బన్నీ లుక్ చూస్తుంటే ఆయన ఎర్ర చందనం దొంగ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదిఏమైనా బన్నీ డి గ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More