హ్యాట్రిక్ విక్టరీ కోసం ఆముగ్గురూ…!

Published on Jun 26, 2019 10:58 am IST

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హోరోయిన్లుగా మాస్టర్ రైటర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్,త్రివిక్రమ్,థమన్ కలిసి పనిచేస్తున్న ఈ మూవీకి ఓ విశేషం ఉంది. అదేంటంటే డైరెక్టర్ త్రివిక్రమ్ కి,థమన్ కి విడివిగా అల్లు అర్జున్ తో కలిపి హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి ‘జులాయి’,’సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా థమన్ మ్యూజిక్ అందించిన ‘రేసుగుర్రం’,’సరైనోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేశాయి. కాబట్టి ప్రస్తుతం ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కనుక విజయం సాధిస్తే ఆ ముగ్గురికి హ్యాట్రిక్ విజయం అవుతుంది. కామెడీ మరియు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈమూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిరవధికంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More