
తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీ లోని ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన ఇప్పుడు గీత ఆర్ట్స్ కాకుండా మరో కొత్త బానేర్ ని కూడా అల్లు అరవింద్ లాంచ్ చేసారు. దానికి గీత ఆర్ట్స్ 2 అని నామకరణం చేసాడు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కంటిన్యూగా స్మాల్ బడ్జెట్ మరియు మీడియం బడ్జెట్ సినిమాలు చేయడానికి అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడు. అది కూడా వేరే పెద్ద బ్యానర్స్ తో కలిసి నిర్మించనున్నాడు. అందులో భాగంగా అప్పుడే మొదటి సినిమాని కూడా మొదలు పెట్టారు.
గీత ఆర్ట్స్ 3 – యువి క్రియేషన్స్ కలిసి యంగ్ హీరో నానితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా మార్చి 2న అధికారికంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ సన్నిహితుడు మరియు ‘100% లవ్’ ‘కొత్త జంట’ నిర్మాత అయిన బన్నీ వాస్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని చూసుకుంటే, అల్లు అరవింద్ ప్రిన్సిపాల్ అడ్వైజర్ గా ఉంటారు. నాని – మారుతి కాంబినేషన్లో చేస్తున్న మొదటి సినిమాకి ‘భలే భలే మగాడివోయ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించనుంది.

