అల్లు శిరీష్ ‘ఏబిసిడి’ ఇప్పట్లో రిలీజ్ కాదా ?

Published on Mar 23, 2019 7:59 pm IST

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబిసిడి. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు.

కాగా ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత మార్చి 21వ తేదీ అని, ఆ తరువాత ఏప్రిల్ లో విడుదల అని ఇలా పలు విడుదల తేదీలు మార్చుకుంది. చివరికి ఈ చిత్రం సమ్మర్ లోనే విడుదల కాదని తెలుస్తోంది. మే తర్వాత మాత్రమే ఈ సినిమా విడుదల కావొచ్చని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి విడుదల తేదీ పై చిత్రబృందం స్పందిస్తే కానీ ఏ విషయం అయింది తెలియదు.

ఇక ఈ చిత్రంలో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా.. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More