‘ఏబిసిడి’తో హిట్ కొడతాడా ?

Published on Apr 18, 2019 2:00 am IST

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబిసిడి. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? కంటెంట్ పరంగా చూసుకుంటే ‘ఏబిసిడి’లో విషయం కాస్త గట్టిగానే ఉందనిపిస్తోంది. మరి ఈ సినిమానైనా అల్లు శిరీష్ కి భారీ హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :