హెవీ వర్కవుట్స్‌తో అల్లు శిరీష్ స్పెషల్ వీడియో.!

హెవీ వర్కవుట్స్‌తో అల్లు శిరీష్ స్పెషల్ వీడియో.!

Published on Jun 22, 2021 11:00 AM IST

రీసెంట్ గానే తన స్టన్నింగ్ బాడీ మేకోవర్ తో ఒక్కొక్కరికి షాక్ ఇచ్చాడు అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్. తన కొత్త సినిమా నిమిత్తం గట్టిగా చేంజ్ అయిన అల్లు శిరీష్ ఆ వర్కవుట్స్ ఎలా చేయాలి.. ఫిట్‌గా ఎలా ఉండాలి అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయి.. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు ఇప్పుడు.

ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియో అప్‌లోడ్ చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తొలి వీడియోలో బ్యాక్ వర్కవుట్స్ గురించి చూపించారు. జిమ్‌లో ఈయన ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియోలో మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడం చూస్తున్నాం.. 30 సెకన్ల వీడియోలో జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఇందులో చూపించారు.

అలాగే తన వర్కవుట్ షెడ్యూల్‌లో చాలా రకాల ఫిట్ నెస్ సూత్రాలు దాగున్నాయి. ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన విషయాలు కూడా చూపించబోతున్నారు. తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు శిరీష్. ఇప్పుడు తన ఫాలోయర్స్ కోసం కూడా వీడియోలు పెట్టి.. ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అల్లు శిరీష్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు