స్టన్నింగ్ మేకోవర్ లో అల్లు శిరీష్.!

Published on May 21, 2021 11:00 am IST

మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాల కోసం ఫిజిక్ పరంగా మాత్రం ఎంత వరకు అయినా వెళ్లారు. ఒకే సినిమాలో తమ ఫిజిక్ పరంగా కానీ లుక్ పరంగా కానీ రెండు మూడు షేడ్స్ ను ఈజీగా చూపించగలుగుతారు. మరి అలాగే సిక్స్ ప్యాక్ బాడీ సిద్ధం చేసే హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా చేరిపోయాడు.

అయితే బన్నీ ఎప్పుడో ఈ ట్రెండ్ ను స్టార్ట్ చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా శిరీష్ తన స్టన్నింగ్ మేకోవర్ ను బయట పెట్టాడు. ఇంతకు ముందు అంటే కాస్త ఫిట్నెస్ గా ఉన్నా ఈసారి ఏకంగా ఆరు పలకల దేహాన్ని సిద్ధం చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇదంతా శిరీష్ తన నెక్స్ట్ సినిమా కోసమే అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం ఈ నెలాఖరులోనే అనౌన్స్ కానున్నట్టుగా టాక్. మొత్తానికి మాత్రం అల్లు శిరీష్ నయా మేకోవర్ మంచి హాట్ టాపిక్ అవుతున్నది.

సంబంధిత సమాచారం :