మోగా మేనల్లుడు అల్లు శిరీష్ మలయాళంలో హిట్ అయిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని తెలుగులో తాను హీరోగా రీమేక్ చేస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఈ చిత్రంలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. అలా తన లుక్ మార్చుకున్నే ప్రాసెస్ లో ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ కొనడానికి స్వయంగా శిరీషే దుబాయ్ వెళ్ళారు.
శిరీష్ కు హెల్ప్ చెయ్యటానికి అల్లు అర్జున్ వ్యక్తిగత స్టైలిస్ట్ అయిన అశ్విన్ మావులే కూడా వెళ్లారు. ప్రస్తుతం అశ్విన్ అల్లు శిరీష్ కు పర్సనల్ డిజైనర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రాంగిని మరియు మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్టర్ భరత్ ఈ చిత్రంలో శిరీష్ ఫ్రెండ్ గా నటించనున్నాడు, ఈ చిత్రం త్వరలోనే మొదలవ్వబోతుంది.


