వీరి మూడవ చిత్రానికి ఖరారైన ముహూర్తం

Published on Sep 11, 2019 1:02 am IST

అల్లు అర్జున్, సుకుమార్… వీరిరువురి పేరు చెబితేనే రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆలా కళ్ళముందు కనబడుతాయి… అయితే ఆర్య, ఆర్య 2 లాంటి రెండు పెద్ద విజయవంతమైన చిత్రాల తరువాత వీరికలయికలో మరొక చిత్రం ఇప్పటివరకు కూడా రాలేదనే చెప్పాలి. కాగా వీరి కలయికలో మూడవ చిత్రానికి తాజాగా ముహూర్తం ఖారరైంది. అయితే ఈ చిత్రం అల్లు అర్జున్ కి 20 వ చిత్రం కానుంది. కాగా ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు లాంఛనంగా వచ్చే నెల 3 న ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ వారు నిర్మించనున్నారు. అక్టోబర్ 20 న ఈ చిత్రం పట్టాలెక్కనుంది సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా వీరి కలయికలో వచ్చినటువంటి రెండు చిత్రాలు కూడా ఎంతటి విజయాన్ని సాధించాయి మనందరికీ తెలిసిందే., కాగా ఇపుడు వీరి కలయికలో రాబోతున్న మూడవ చిత్రానికి అంచనాలు భారీ గానే ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాలకంటే కూడా అద్భుతమైన కథను రెడీ చేశాడంట దర్శకుడు సుకుమార్. కాగా ప్రస్తుతానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More