‘బన్నీ’ మ్యాచ్ చూస్తుంటే.. ‘పూజ హెగ్డే’ షూట్ చేసింది !

Published on Jun 16, 2019 7:05 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న బన్నీ 19వ సినిమా సెకండ్ షెడ్యూలకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే లాంగ్ బ్రేక్ అనంతరం మొదలైన ఈ రెండవ షెడ్యూల్ లో పూజ హెగ్డేతో పాటు సినిమాలోని మిగిలిన స్టార్ కాస్టింగ్ కూడా పాల్గొంటున్నారు.

కాగా 2019 ప్రపంచ కప్ లో భాగంగా చిరకాల శత్రువులుగా పేరు మోసిన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుండి ప్రముఖులు వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. బన్నీ కూడా ఒక పక్క బిజీ బిజీగా షూట్ చేస్తేనే.. మధ్యమధ్యలో భారత్‌ – పాకిస్థాన్‌ మ్యాచ్ చూస్తున్నాడు.

ఈ దృశ్యాన్ని హీరోయిన్ పూజ హెగ్డే తన కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రం పైనే బన్నీ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More