డైరెక్ట్ ఓటిటిలో రానున్న నాలుగు టాలీవుడ్ సినిమాలు.!

Published on Aug 14, 2020 3:02 am IST


ఈ ఏడాది అనుకోని విధంగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయే సరికి అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఛిన్నాభిన్నం అయ్యింది. షూటింగులు లేక అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయిన ఎన్నో చిత్రాలు విడుదల ఆగిపోయాయి. దీనితో ఇదే సమయాన్ని ఓటిటి ఫ్లాట్ ఫామ్ వారు క్యాష్ చేసుకున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లోని చాలా చిత్రాలు నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్నాయి.

అలా మన తెలుగులో కూడా చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మన టాలీవుడ్ లో కాస్త తక్కువ సంఖ్యలోనే చిత్రాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ పరిస్థితులు చక్కబడే మార్గం కనిపించకపోయే సరికి మన దగ్గర మేకర్స్ కూడా తమ చిత్రాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

అలా ఇప్పుడు ఓ నాలుగు మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే నాని నటించిన “వి” చిత్రం కన్ఫర్మ్ అని మాట వినిపిస్తుండగా ఇంకా ఈ టాక్ ప్రకారం “అరణ్య”, “నిశ్శబ్దం”, “ఉప్పెన”, “సోలో బతుకే సో బెటర్” మరియు “రెడ్” చిత్రాలు ఉన్నాయి. మరి వీటిలో ఏమన్నా డిజిటల్ గా విడుదల అవుతాయో లేక ఏమన్నా మారుతాయో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More