బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఫస్ట్ ఫిమేల్ స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’ బాక్సాఫీస్ మంచి విజయాన్ని సాధిస్తోంది. అలియా భట్, శార్వరి మెయిన్ లీడ్‌లో నటించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ 20 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100.16 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 71.12 కోట్ల గ్రాస్ సాధించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో 3.02 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అలియా భట్, శార్వరిల యాక్షన్ స్టంట్స్, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో చూపించిన పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని ఆదిత్య చోప్రా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన ఈ లేడీ స్పై థ్రిల్లర్ రూ.100 కోట్ల మైలురాయిని దాటడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.



