ముఖ్య అంశాలు
- బాలీవుడ్ ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫిమేల్-సెంట్రిక్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’ టీజర్ విడుదలైంది.
- అలియా భట్, శర్వరీ వాఘ్ పవర్ ఫుల్ స్పై పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకమైన రోల్స్ ప్లే చేస్తున్నారు.
- “ప్రపంచంలో రెండే రకాల మనుషులు ఉంటారు” అంటూ కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుండగా.. 2026 జులై 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌కు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్ ‘టైగర్’, హృతిక్ రోషన్ ‘వార్’, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’. మొదటిసారిగా ఫిమేల్ లీడ్స్‌తో, అదీ అలియా భట్, శర్వరీ వాఘ్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆల్ఫా’ అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ఈ టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లింది. పద్దెనిమిదో ఏట అడుగుపెట్టిన కూతురికి తండ్రి బర్త్ డే విషెస్ చెప్పడంతో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ వెంటనే “నీ 18వ పుట్టినరోజుకు నీ మొదటి మిషన్‌కు వెళ్తున్నావు” అని చెప్పడం, దానికి ఆమె “ప్రపంచంలో రెండు రకాల మనుషులే ఉంటారు.. ఒకటి తోడేలు, ఇంకొకటి గొర్రె.. తోడేలు కూతురు తోడేలే అవుతుంది” అని బదులివ్వడం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇండియాకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ సోల్జర్స్‌ను తయారు చేసే అత్యంత పవర్ ఫుల్ సీక్రెట్ ప్రోగ్రామ్ పేరే ‘ఆల్ఫా’ అని టీజర్‌లో దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇక అలియా భట్, శర్వరీ వాఘ్ ఇద్దరూ యాక్షన్ సీన్స్‌లో ప్రాణాలు పెట్టి నటించారని టీజర్‌లోని స్టన్నింగ్ విజువల్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది.
శివ్ రావైల్ డైరెక్ట్ చేస్తున్న ఈ హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, యానిమల్ విలన్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తుండటం మరో మేజర్ అట్రాక్షన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. “మన ఏకైక ఆల్ఫా” అంటూ టీజర్ ఎండింగ్‌లో వచ్చే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇద్దరు పవర్ ఫుల్ హీరోయిన్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వస్తున్న ఈ సినిమాను.. 2026 జులై 3న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


