అప్పుడే పవన్ హీరోయిన్ పై రచ్చ మొదలయ్యింది.!

Published on Oct 28, 2020 2:01 pm IST

లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధమైన వరుస ప్రాజెక్టులను ఓకే చేసెయ్యడం మంచి హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ఇటీవలే మలయాళ చిత్రం “అయ్యప్పణం కోషియమ్” రీమేక్ కు గాను పవన్ పచ్చ జెండా ఊపడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ పవన్ అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఓ పక్క విపరీతమైన బజ్ ను ఏర్పర్చుకున్న ఈ చిత్రంపై మరో అంశం హాట్ టాపిక్ గా సాగుతుంది. ఈ చిత్రం తాలూకా ఒరిజినల్ వెర్షన్ లో పవన్ రోల్ కు గాను ఒక ఫిమేల్ లీడ్ ఉంటుంది అది కూడా చాలా తక్కువ నిడివితోనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రోల్ కు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఫిక్సయ్యింది అని టాక్ రేంజ్ లో ఊపందుకుంది.

ఆ టాక్ ప్రకారం ఈ రోల్ ను సాయి పల్లవి చేస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకో పవన్ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో కాస్త ఉత్సాహంగానే ఉన్నారు. మరి మేకర్స్ ఈ చిత్రంలో ఆ రోల్ కు ఎవరిని ఓకే చేసారు అన్నది రివీల్ చెయ్యాల్సి ఉంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More