
సాధారణం గా ఎంతో మంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్తారు. అమల పాల్ మాత్రం అందుకు భిన్నం గా నడుచుకోనుంది. అమల త్వరలో త్వరలో పెళ్లి చేసుకోనుంది అనే వార్తలు వచ్చినప్పటినుంచి తను సినిమాలకు వీడ్కోలు చెప్తుందని వదంతలు వచ్చాయి.
హవిష్ హీరో గా నటిస్తున్న ఒక చిత్రం లో అమల పాల్ ని హీరోయిన్ గా తొలగించడం తో ఆ వదంతలు నిజమే అని అందరు అనుకున్నారు. అయితే అమల మాత్రం తన కెరీర్ కొనసాగించాలనుకుంటుంది. అమల పెళ్లి తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకోని ఆ తర్వాత తిరిగి నటించనుంది.
దర్శక నిర్మాతలని తనని ప్రధాన ఎంపిక గా కోరుతుందని సమాచారం.