బాలీవుడ్ తెరపై అక్కినేని అమల రీ ఎంట్రీ

బాలీవుడ్ తెరపై అక్కినేని అమల రీ ఎంట్రీ

Published on Dec 15, 2014 1:42 PM IST

amala
చాలా రోజుల తర్వాత ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చారు అక్కినేని అమల. నాగార్జునతో వివాహానంతరం ఆమె నటించిన తొలి సినిమా ఇది. ఇప్పటికీ ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదు. అందమైన నవ్వు చెక్కు చెదరలేదు. కాన్సర్ పేషెంట్ గా ఆమె నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.

తాజాగా ఇమ్రాన్ హాష్మి, విద్యా బాలన్ జంటగా మొహిత్ సూరి దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘హమ్ అధూరి కహాని’లో అమల అతిధి పాత్రలో నటించారు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాగార్జున ‘శివ’, కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులకు అమల సుపరిచితురాలే.

ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలపై తన దృష్టిని నిలిపిన అమల, మధ్యలో అప్పుడప్పుడూ ఇలా ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. గత ఏడాది ‘మనం’, తమిళ సీరియల్ ‘ఉయిర్‌ మెయ్’ లలో అమల నటించారు.

తాజా వార్తలు