తమ్మారెడ్డి భరద్వాజ చేతికి బోల్డ్ మూవీ !

తమ్మారెడ్డి భరద్వాజ చేతికి బోల్డ్ మూవీ !

Published on Jul 3, 2019 11:14 AM IST

అమలాపాల్ ప్రస్తుతం ”ఆడై” అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రత్నకుమార్‌ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్‌ పతాకం పై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ లో అమలాపాల్ మరీ బోల్డ్‌ గా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. ట్రైలర్ లో ముఖ్యంగా.. చివర్లో వచ్చే అమలాపాల్ న్యూడ్ షాట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కామిని అనే పాత్రలో నటిస్తున్న అమలా పాల్, కొన్ని దారుణమైన పరిస్థితుల నుండి ఎలా బయటపడగలిగింది అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. ముఖ్యంగా సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి అమలాపాల్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు