పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !
Published on Sep 10, 2018 6:00 pm IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి అయింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుకుంటుంది చిత్రం. ఐతే దర్శకుడు శ్రీను వైట్ల పోస్ట్-ప్రొడక్షన్ పనులను తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటున్నారు.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ కొడతారో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook